JC Prabhakar Reddy: జేసీ నివాసం వద్దకు పోలీసులు.. తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

Published : 25 Sep 2023 09:16 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పెద్దపప్పూరు మండలం తిమ్మంచెరువులో వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కల్యాణ మండపానికి భూమి పూజ చేసేందుకు జేసీ సిద్ధమయ్యారు. అయితే దానికి అనుమతి లేదంటూ భారీగా పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని