Ponnam Prabhakar: నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి.. అనవసర విమర్శలొద్దు: పొన్నం ప్రభాకర్‌

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అమీర్‌పేట్‌లో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు.

Updated : 03 Mar 2024 12:05 IST

హైదరాబాద్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నగరంలోని అమీర్‌పేట్‌లో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్‌ రీడింగ్‌ను తీసి స్వయంగా జీరో బిల్లులను  మహిళలకు అందజేసి మాట్లాడారు. ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. 

‘‘ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తాం. పేదలను ఆదుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని పథకాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేశాం. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత ఏర్పడుతోంది’’ అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని