
Updated : 06 Nov 2021 19:23 IST
Ts News: కేసీఆర్‌ను అభినందించినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: క్రిష్ణయ్య
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను ఇటీవల అభినందించినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తన చరవాణి నంబర్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టారని, రెండు రోజుల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఎందుకు మద్దతు తెలిపావని బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారో తేల్చాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరినట్టు క్రిష్ణయ్య తెలిపారు. ఈ మేరకు హోం మంత్రి, డీజీపీకి వినతిపత్రం సమర్పించినట్టు వెల్లడించారు.
Tags :