Revanth Reddy: రేవంత్‌ పాదయాత్ర..షెడ్యూల్‌ ఇదే

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ (Hath se Hath jodo Abhiyan) పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ములుగులోని సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Published : 05 Feb 2023 17:25 IST

హైదరాబాద్‌: ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ (Congress) సిద్ధమవుతోంది. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ (Hath se Hath jodo Abhiyan)లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. వరంగల్‌ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్‌, ప్రాజెక్ట్‌ నగర్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ నగర్‌లో భోజన విరామం అనంతరం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి  రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని