కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి కంటే మెరుగైన పోర్టల్‌: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ధరణి కంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు.

Published : 08 Nov 2023 13:50 IST

ఖానాపూర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ధరణి కంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌కు మద్దతుగా నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రేవంత్‌ మాట్లాడారు.

‘‘డబ్బును చూసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. భారాస నేతల వద్ద డబ్బులుంటే కాంగ్రెస్‌ అభ్యర్థుల వద్ద ఓట్లు ఉన్నాయి. భారాస, భాజపాలు డబ్బును చూసి అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఆదిలాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించాం. భారాస ప్రభుత్వం కడెం ప్రాజెక్టు నిర్వహణ చేపట్టలేకపోతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు, పేదలకు భూములు ఇచ్చింది. భారాస ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి పేదల భూములను గంజుకుంది. రైతులను భారాస ప్రభుత్వం నిండా ముంచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని