Andhra News: కొనసాగుతున్న బుజ్జగింపులు.. కాసేపట్లో సీఎం వద్దకు బాలినేని

వైకాపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన

Published : 11 Apr 2022 15:18 IST

విజయవాడ: వైకాపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డిలు వచ్చారు. బాలినేనితో ఈ ముగ్గురు భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం కొత్త మంత్రుల పేర్లు బహిర్గతం అయినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో సమావేశం కావడం ఇదో మూడోసారి. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మరోసారి సజ్జల.. బాలినేనితో భేటీ అయిన విషయం తెలిసిందే. అయినా బాలినేని వైఖరిలో మార్పు రాలేదని సమాచారం. ఈ క్రమంలో మరోసారి భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, సీఎం జగన్ స్వయంగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా సజ్జలను సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కలిసి బాలినేనిని సీఎం వద్దకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని