అర్చకులపై దాడి, బెదిరింపులు రాక్షసత్వమే: వేమూరి ఆనందసూర్య

జగన్‌ పాలనలో అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని.. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని తెదేపా నేత, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద సూర్య విమర్శించారు.

Published : 26 Mar 2024 15:08 IST

అమరావతి: జగన్‌ పాలనలో అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని.. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని తెదేపా నేత, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద సూర్య విమర్శించారు. కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 200కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. అర్చకులపై దాడి, బెదిరింపులు రాక్షసత్వమే అవుతుందన్నారు. బ్రాహ్మణుల జీవితాలతో సీఎం జగన్‌ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా నాయకుడు.. తథా క్యాడర్ అన్న చందంగా వైకాపా నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారని ఆక్షేపించారు. భగవంతుని సన్నిధిలో అందరూ ఒక్కటే అనే ఇంగిత జ్ఞానం కూడా వారికి లేకపోవడం బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని