AP News: క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలి: వర్ల రామయ్య

కృష్ణాజిల్లా పామర్రు పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని మంత్రి

Updated : 21 Jan 2022 17:19 IST

పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుడివాడ పట్టణంలో వైకాపా నేతలను పోలీసులు కంట్రోల్‌ చేయలేరా? అని నిలదీశారు. ‘‘బొండా ఉమా కారును ధ్వంసం చేస్తుంటో పోలీసులు ఏం చేస్తున్నారు? తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటారా? వైకాపా వాళ్లు ఉన్నారు... మీపై దాడి చేస్తారు వెళ్లిపోండి అని పోలీసులే చెబుతున్నారు. పోలీసులు ఉన్నది ఎందుకు? ప్రజలను రక్షించడానికి కాదా? తెదేపా నేతల కార్లు ధ్వంసం చేస్తుంటే నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు. ఇదెక్కడి అన్యాయం. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలని గర్తించాలి. భారత రాజ్యాంగం తెలుగుదేశం పార్టీకి వర్తించదా? పోలీసుల కళ్లముందే దాడి జరిగినా పట్టించుకోరా? కొడాలి నాని పక్కన కూర్చునేందుకు సీఎంకు సిగ్గులేదా?’’ అని తీవ్రంగా స్పందించారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ... గుడివాడలో క్యాసినో, పేకాట శిబిరాలు నడుస్తున్నాయని ఆరోపించారు. వాటికి సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. గుడివాడలో ఏమీ లేకుంటే చూపించేందుకు ఎందుకు భయం?అని ప్రశ్నించారు. కొడాలి నానిని రక్షించేందుకు అందరూ రంగంలోకి దిగారని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్‌.. వైకాపా నేతలకు ఆదాయ వనరుగా మారాయని ఆరోపించారు. అధికార బలంతో ఏదైనా చేస్తామంటే .. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బొండా ఉమా హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని