TDP: జగన్‌ పులివెందులలో లేకపోయినా.. ఆయన ఓటు అక్కడెలా ఉంది?: పయ్యావుల

మూకుమ్మడిగా ఓట్లను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఎన్నికల సంఘం గతంలో స్పష్టంగా చెప్పిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav ) అన్నారు. 

Published : 24 Aug 2023 15:07 IST

అనంతపురం: అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఓట్లు తొలగించే అధికారులపై చర్యలు ఇద్దరి సస్పెన్షన్‌తో ముగిసిపోదని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav ) అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఊరిలో లేరన్న కారణంతో ఓట్లు తొలగించడం సరికాదని.. సీఎం జగన్‌ (CM Jagan) గత 30 ఏళ్లుగా పులివెందులలో లేకపోయినా అక్కడ ఓటు ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. ఓటరుకు ఎన్నికల కమిషన్ చాలా ప్రాధాన్యత ఇస్తోందని.. ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక వ్యక్తి ఐదు ఓట్లకు మాత్రమే అభ్యర్థన ఇవ్వగలరని అన్నారు. ఈఆర్‌వో స్థాయి అధికారి స్వయంగా తనిఖీ చేసి అభ్యర్థలను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? నిర్ణయించాలన్నారు.

ఓట్లను తొలగించే ముందు ముగ్గురు సభ్యుల కమిటీని వేసి.. ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి ఎదుటే మరోసారి తనిఖీ నిర్వహించాలన్నారు. మూకుమ్మడిగా ఓటర్లను తొలగించే అధికారి ఎవరికీ లేదని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పిందని పయ్యావుల కేశవ్‌ గుర్తు చేశారు. గతంలోనే ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడిన బీఎల్‌వోలు (బూత్‌ లెవెల్‌ అధికారులు) సస్పన్షన్‌కు గురికాగా.. ప్రస్తుతం ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసిందన్నారు. తన ఫిర్యాదుతో రాష్ట్రవ్యాప్తంగా జాబితాలో ఓట్లు తొలగించిన వైనంపై విచారణ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు కేశవ్ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని