AP BJP: సినిమా హాళ్లు, బార్లకు లేని నిబంధనలు ఉత్సవాలకా?: భాజపా

ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Updated : 07 Sep 2021 14:04 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 150పైగా ఇటువంటి ఘటనలు జరిగినా అరెస్టులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కన్నాతో పాటు భాజపా నేతలు, వీహెచ్‌పీ నేతలు విజయవాడలో గవర్నర్‌ను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం భాజపా నేతలు మీడియాతో మాట్లాడారు.

వినాయకచవితి పండగను ఇంట్లోనే జరుపుకోవాలన్న జీవోను ఖండిస్తున్నామని చెప్పారు. సినిమా హాళ్లు, స్కూళ్లు, బార్లకు లేని నిబంధనలు ఉత్సవాలకా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ జోక్యం చేసుకొని ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండగ జరిపి తీరుతామని కన్నా స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని