మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై రాళ్లదాడి

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. జి.కొండూరు మండలం గడ్డమణుగు వద్ద కొండపల్లి..

Updated : 27 Jul 2021 20:38 IST

జి.కొండూరు: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైకాపా వర్గీయులు రాళ్లదాడికి దిగారు.  కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద  వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసమైనట్టు సమాచారం. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. తెదేపా, వైకాపా వర్గాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉమా వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి దేవినేని ఉమాకు చంద్రబాబు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని,  వైకాపా నేతల అక్రమాలపై పోరాడేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని