TS News: ఆ వివరాలను తెరాస ఎందుకు బయట పెట్టట్లేదు?: లక్ష్మణ్‌

బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు.

Updated : 24 Sep 2022 15:07 IST

హైదరాబాద్‌: బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని చెప్పారు. హైదరాబాద్‌లో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే చేసిన తెరాస సర్కారు వివరాలను ఎందుకు బయటపెట్టడంలేదని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలను అణిచివేస్తున్నారన్న లక్ష్మణ్‌.. బీసీల సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలంటే 50 శాతం ఉన్న బీసీలతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని