ఎంత కఠిన హృదయమైనా కరగక మానదు..: సీపీఐ నారాయణ

మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామంటూ ప్రధాని నరేంద్రమోదీ శుభవార్త చెప్పారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.

Updated : 19 Nov 2021 18:05 IST

దిల్లీ: మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామంటూ ప్రధాని నరేంద్రమోదీ శుభవార్త చెప్పారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని చెప్పారు. ఎంతో మంది చనిపోయినా దిల్లీ సరిహద్దుల్లో రైతులు అలుపెరుగకుండా పోరాడారని.. దేశమొత్తం వారికి మద్దతుగా నిలిచిందన్నారు. 

ఎంత కఠినమైన హృదయమైనా కరగక మానదన్నట్లుగా మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సంతోషకరమని.. దీనికి అభినందిస్తున్నట్లు నారాయణ చెప్పారు. ఈ పోరాటంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ రైతులు మరికొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. వాటి పరిష్కారానికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. సుదీర్ఘ పోరాటంతో విజయం సాధించిన రైతులకు నారాయణ అభినందనలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని