సీఎంపై నమ్మకం ఉంది.. దళితబంధు అమలు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి

తెలంగాణలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని.. అమలు చేస్తారనే నమ్మకం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విశ్వాసం వ్యక్తం చేశారు..

Updated : 29 Aug 2021 16:42 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని.. అమలు చేస్తారనే నమ్మకం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ మాటల్లో నిజాయతీ కనిపించిందని.. ఒకవేళ దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర ఆత్మహత్య చేసుకుంటారన్నారు. ఇతర పార్టీలతో కలిసి దళితబంధుపై రేవంత్ రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారని.. ఇందుకు నిరసనగా మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని లిబర్టీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్షకు కూర్చున్నారు.

‘‘రాష్ట్రంలో దళితబంధు పథకం తీసుకురావడం ద్వారా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సరికొత్త ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఓ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ ఎవరూ దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. దళితబంధు పథకం అమలుకు కాంగ్రెస్, భాజపా ఎందుకు అడ్డుపడుతున్నాయి. రేవంత్‌రెడ్డి తెదేపాను నిలువునా ముంచేశారు. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబు నాశనం అయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం’’ అని మోత్కుపల్లి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని