KTR: ఆ 21రోడ్లను తెరిపించండి: కిషన్‌రెడ్డికి కేటీఆర్‌ ట్వీట్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Updated : 20 Dec 2021 13:56 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పంపించారు. లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.

కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారులను మూసేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ వాహనదారుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్‌ ఆ విషయాన్ని కిషన్‌రెడ్డికి రీట్వీట్ చేశారు. 21 రహదారుల జాబితా ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరగా.. ఆయా రహదారుల పేర్లను కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా పంపించారు. కేంద్రమంత్రి అజయ్ భట్.. కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు రహదారులనే మూసేశామంటూ పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని కేటీఆర్ రెండు రోజుల క్రితం ట్విటర్ ద్వారా విమర్శించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని