MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ‘ఎమ్మెల్సీ’ షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Updated : 09 Nov 2021 14:56 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలో 12, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించి 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ఏయే జిల్లాల్లో ఎన్నంటే..

తెలంగాణలోని 9 జిల్లాల్లో 12 స్థానాలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి చొప్పున.. ఆదిలాబాద్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 

ఏపీలోని 8 జిల్లాల్లో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో రెండేసి.. అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని