Nara Bhuvaneswari: నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్‌ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
Rohit - Yuvaraj: రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్