Nara Lokesh: నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదలిపెట్టను: నారా లోకేశ్‌

తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని.. తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్...

Updated : 22 Dec 2021 15:17 IST

అమరావతి: తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని.. తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. తన తండ్రిలా మెతక వైఖరితో ఉండనని.. గట్టిగా సమాధానం ఇస్తానని చెప్పారు. మంగళగిరిలో లోకేశ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవం కోరుకునే కుటుంబం తమదని.. మీ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపైనా ఇలాగే మాట్లాడతారా? అని వైకాపా నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు.. విదేశాల్లో జల్సాలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఆదుకున్న తమపై నిందలు వేస్తారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

28వ వార్డులో డంపింగ్‌ యార్డు తరలించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో గెలిచిన 10 రోజుల్లో డంపింగ్‌ యార్డును తరలిస్తానని చెప్పిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి 10 రోజులు పూర్తవ్వలేదా? అని నిలదీశారు. సీఎం నివాసముంటున్న నియోజకవర్గంలోనే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే.. రాష్ట్రం పరిస్థితేంటన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని