Ap News: బద్వేల్‌ ఉపఎన్నిక.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీకి భాజపా ఫిర్యాదు

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..

Published : 24 Oct 2021 15:52 IST

బద్వేల్‌: కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల, బి.కోడూరులో ఆశా వర్కర్లకు ఫోన్లు, వాచీలు పంపిణీ చేస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది, స్థానిక నేతలపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని