AP News: వివేకా హత్య కేసును రాజకీయాలతో ముడిపెట్టొద్దు: శ్రీకాంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంఘటన జరిగినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని .. ప్రజల గురించి, రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీ ఆలోచించడం లేదని ఏపీ చీఫ్‌విప్‌..

Updated : 14 Nov 2021 22:00 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంఘటన జరిగినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని .. ప్రజల గురించి, రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీ ఆలోచించడం లేదని ఏపీ చీఫ్‌విప్‌  శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా జగన్‌ మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కర్ణాటక రాష్ట్రం వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టీ సీబీఐ విచారణ కోరారు. ఆనాడు వివేకా గెలుపుకోసం జగన్మోహన్‌రెడ్డి కృషి చేశారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించిన విషయాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ‘‘వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాలు శనివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని