AP News: వైకాపాకు లేని నిబంధనలు రైతుల పాదయాత్రకు అడ్డొచ్చాయా?: లోకేశ్

రాజధాని మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు చేసిన హెచ్చరికలపై తెదేపా

Updated : 07 Nov 2021 12:14 IST

అమరావతి: రాజధాని మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు చేసిన హెచ్చరికలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. వైకాపాకు లేని నిబంధనలు అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డొచ్చాయా అని నిలదీశారు. అధికార పార్టీ వాళ్లు విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేయట్లేదా అని ప్రశ్నించారు. కొవిడ్‌ నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డొచ్చాయా అని ఆయన ధ్వజమెత్తారు. వైకాపా ర్యాలీలకు పోలీసులు రెడ్ కార్పెట్‌ వేస్తున్నారని మండిపడ్డారు.

రైతుల మహా పాదయాత్రకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న వారికి నోటీసులు ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి భంగపాటు తప్పదని చెప్పారు. యాత్రను అడ్డుకోవాలని చూస్తే... ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని