Amaravati news: రహస్య జీవోలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తెదేపా 

జీవోల ఆఫ్‌ లైన్‌ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే జోక్యం చేసుకుని జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని కోరారు.

Updated : 20 Aug 2021 21:40 IST

విజయవాడ: జీవోల ఆఫ్‌ లైన్‌ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే జోక్యం చేసుకుని జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం తెదేపా నేత వర్లరామయ్య మీడియాతో మాట్లాడుతూ... రాత్రిపూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని, వారం రోజుల్లో ప్రభుత్వం ఆదేశాలను వెనక్కితీసుకోని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బ్లాంక్‌ జీవోలు ఇచ్చేందుకు వీలు లేదన్నారు. బ్లాంక్‌ జీవోలపై ఫిర్యాదు చేయగానే ఆన్‌లైన్‌లో జీవోలు తీసేశారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.  ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని