TS News: ప్రతి నిరుద్యోగికీ కేసీఆర్‌ బకాయి: రేవంత్‌

తెలంగాణలో ప్రజలు ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 30 Sep 2022 14:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజలు ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు, ఉద్యమకారులను ద్వేషిస్తున్నారని మండిపడ్డారు. నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ నిరసన కార్యక్రమం సందర్భంగా  జరిగిన లాఠీఛార్జీలో గాయపడిన కార్యకర్తలను రేవంత్‌ పరామర్శించారు. నాగోల్‌లో బల్మూరి వెంకట్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తండ్రి, కుమారుడు భోగాలు అనుభవిస్తున్నారు. శ్రీకాంతాచారి మెడలో కనీసం దండ వేయనీయలేదు. ప్రతి నిరుద్యోగ యువకుడికి కేసీఆర్‌ బకాయి ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ నిర్వహిస్తాం. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్‌ ఉద్యమిస్తోంది. భాజపా, తెరాస పార్టీలు ఒక్కటే. రాష్ట్రంలో తెరాసకు, కేంద్రంలో భాజపాకు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం’’ అని రేవంత్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని