YS Sharmila: జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి: షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు.

Updated : 15 Mar 2024 18:51 IST

కడప: అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతాయేనని చెప్పారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌(YS Jagan)పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు.  

‘‘హంతకులు ఎవరో కాదు.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా?ఇవాళ్టి వరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైకాపా కోసమే పనిచేశారు. సాక్షిలో పైన వైఎస్‌ ఫొటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా?ఆయన వారసుడిగా మీరేం చేశారు?’’ అని షర్మిల నిలదీశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని