Ys Sharmila: ఎంపీ అర్వింద్‌ పసుపు రైతులను మోసం చేశారు: షర్మిల

నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లిలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల నిరుద్యోగ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ...

Published : 05 Oct 2021 19:55 IST

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లిలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల నిరుద్యోగ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఎంపీ అర్వింద్‌ పసుపు రైతులను మోసం చేశారని విమర్శించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన రూ.4లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. ‘‘ యూనివర్సిటీలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను విస్మరిస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు 100 మంది నామినేషన్లు వేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు. కేసీఆర్‌కు ఎందుకంత భయం’’ అని షర్మిల ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని