IND vs NZ: రహానె.. ఫామ్ అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు : పుజారా
గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అజింక్య రహానెకు.. ‘నయావాల్’ ఛెతేశ్వర్ పుజారా అండగా నిలిచాడు. రహానె గొప్ప ప్లేయర్ అని, అతడు మునుపటి ఫామ్ అందుకునేందుకు ఒక్క ఇన్నింగ్స్..
ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అజింక్య రహానెకు.. ‘నయావాల్’ ఛెతేశ్వర్ పుజారా అండగా నిలిచాడు. రహానె గొప్ప ప్లేయర్ అని, అతడు మునుపటి ఫామ్ అందుకునేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలని పేర్కొన్నాడు. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో అతడు సత్తా చాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘ప్రతి ఒక్క ఆటగాడి కెరీర్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. రహానె గొప్ప ఆటగాడు. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుని.. బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో అతడు మెరుగ్గా రాణిస్తాడనుకుంటున్నా’ అని పుజారా అన్నాడు. మరోవైపు.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా అజింక్య రహానె ఫామ్‌పై స్పందించాడు. టెస్టుల్లో రహానె వరుసగా విఫలమవుతున్నా.. అతడిపై నమ్మకంతో తుదిజట్టులో చోటు కల్పించడం, కాన్పుర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అతడి అదృష్టమని గంభీర్ అన్నాడు. ఈసారి అయినా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నానన్నాడు. తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. అజింక్య రహానె కెప్టెన్‌గా, ఛెతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమ్ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో స్థానం కోసం ఎదురు చూస్తుండటంతో.. తొలి టెస్టులో రహానె విఫలమైతే.. అతడి కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్‌లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్‌మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్‌కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్‌లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్‌ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్‌గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్‌గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్