ధోనీకి కరోనా పరీక్షలు.. ఫలితం ఎప్పుడంటే..

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ బుధవారం కరోనా వైరస్‌ పరీక్షలు చేసుకున్నాడు. రాంచీలోని స్థానిక గురునానక్‌ ఆస్పత్రి...

Published : 13 Aug 2020 13:57 IST

తన నైపుణ్యాలతో అబ్బురపరుస్తాడు: షేన్‌వాట్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ బుధవారం కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నాడు. రాంచీలోని స్థానిక గురునానక్‌ ఆస్పత్రి వర్గాలు అతడి నుంచి నమూనాలు‌ సేకరించాయి. వాటి ఫలితాలు ఈరోజు సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ధోనీతో పాటు మరో చెన్నై ఆటగాడు మోను కుమార్‌ సింగ్‌ సైతం ఈ పరీక్షలు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఫలితాల్లో వారిద్దరికీ నెగిటివ్‌ రాగానే చెన్నై బయలు దేరి వెళ్లనున్నారు. ఆగస్టు 15 నుంచి 20 తేదీల మధ్య సీఎస్కే ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచే 21న ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లనున్నాడు. అయితే, ఐపీఎల్‌ ఆటగాళ్లు ఎవరైనా అక్కడికి వెళ్లే ముందు రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకోవాలి. అలాగే అక్కడికి వెళ్లాక కూడా పలుమార్లు టెస్టులు చేస్తారనే విషయాలు తెలిసినవే.

మరోవైపు ధోనీపై సీఎస్కే ఆటగాడు షేన్‌వాట్సన్‌ ప్రశంసలు కురిపించాడు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ టీమ్‌ఇండియా మాజీ సారథి వయసుపైబడిన వాడిలా కనిపించడని చెప్పాడు. మహీకి ఇంకా ఆడాలని ఉందని, అతనెప్పుడూ ఎవర్‌గ్రీన్‌ ప్లేయర్‌ అని కొనియాడాడు. అతడు పూర్తిఫిట్‌నెస్‌తో ఉంటాడని, తన నైపుణ్యాలతో అబ్బురపరుస్తాడని తెలిపాడు. ఇదిలా ఉండగా, వాట్సన్‌ ఐపీఎల్‌లో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. 2008 నుంచి ఆడుతున్న అతడు వేర్వేరు జట్ల తరఫున ఆడినా మంచి ప్రదర్శన చేశాడు. చివరికి 2018 నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతున్న అతడు ఆ ఏడాది దూకుడైన బ్యాటింగ్‌తో టైటిల్‌ అందించాడు. అలాగే గతేడాది ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లోనూ మ్యాచ్‌ను గెలిపించేంత పని చేశాడు. చివర్లో వాట్సన్‌(80; 59 బంతుల్లో 8x4, 4x6) రనౌట్‌ అవ్వడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని