IND vs ENG: రోజంతా ఆడితే.. భారత్‌దే గెలుపు : మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

 నాలుగో టెస్టులో విజయావకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. భారత జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని...

Updated : 04 Sep 2021 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్కు: నాలుగో టెస్టులో విజయావకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. భారత జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని.. వాళ్లు కచ్చితంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఓవల్‌ మైదానంలో రాణిస్తారని విశ్లేషించాడు. రెండో రోజు భారత్‌ తక్కువ పరుగులకే ఇంగ్గాండ్‌ను నిలువరిస్తుందని అంచనా వేసినా బౌలర్లు పట్టు విడవడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓలీ పోప్‌ (81), క్రిస్ వోక్స్‌ (50)ను నిలువరించలేకపోవడంతో ఇంగ్గాండ్‌ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లీ సేన మూడో రోజు మొత్తం బ్యాటింగ్‌ చేయగలిగితే ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించవచ్చని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా ఆటగాళ్లంతా మ్యాచ్‌ గెలవాలనే కసితో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తుంది. అయితే, మొదటి సెషన్‌ చాలా కీలకం. భారత్‌ బ్యాటింగ్‌లో రాణించలేకపోతే.. మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. రోజంతా ఆడి కనీసం 250 పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తేనే ఇంగ్లాండ్‌కు గట్టిపోటీ ఇవ్వగలుగుతాం’ అని లక్ష్మణ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని