క్రికెట్‌కు పార్థివ్ పటేల్ గుడ్‌బై
టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 18 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణాన్ని
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 18 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నట్లు భావోద్వేగంతో తెలిపాడు. టీమిండియా తనపై విశ్వాసాన్ని ఉంచి 17 ఏళ్ల వయసులోనే అవకాశం కల్పించిందని అన్నాడు. భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. శ్రీలంకతో 2012లో చివరి వన్డే ఆడాడు.
‘‘అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తున్నా. 18 ఏళ్ల నా క్రికెట్ ప్రయాణాన్ని నేటితో ముగిస్తున్నా. నా కెరీర్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 17 ఏళ్ల వయసులో నాపై విశ్వాసాన్ని ఉంచి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కెరీర్లో మార్గదర్శకం చేస్తూ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని పార్థివ్ పేర్కొన్నాడు. కెప్టెన్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తొలి అవకాశం ఇచ్చిన గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. 2002లో దాదా కెప్టెన్సీలోనే పార్థివ్ ఇంగ్లాండ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు.
35 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ పార్థివ్ టెస్టుల్లో 934, వన్డేల్లో 1696 పరుగులు చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పోటీ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు పార్థివ్ వెల్లడించాడు. ఐపీఎల్లో తనకి అవకాశాలు ఇచ్చిన జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఓపెనర్‌గా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు లీగ్‌లో 2848 పరుగులు చేశాడు. 13వ సీజన్లో బెంగళూరు జట్టులో ఉన్న పార్థివ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. గత 13 సీజన్లలో అతడు ముంబయి, చెన్నై, బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, దేశవాళీ క్రికెట్లో పార్థివ్ సత్తాచాటాడు. 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 11,240 పరుగులు చేశాడు. దీనిలో 27 శతకాలు ఉన్నాయి.
ఇదీ చదవండి
టెస్టు సిరీస్‌కు ముందే ఆసీస్‌కు షాక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!