Dhoni: అది ధోనీ పద్ధతి.. ఇతరులది వేరే!
టీమ్ఇండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆయన సంజూ బ్యాటింగ్‌పై స్పందించాడు...
(Aakash Chopra Facebook Photo)
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సూచించాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆయన సంజూ బ్యాటింగ్‌పై స్పందించాడు. శ్రీలంక పర్యటనలో వన్డే క్రికెట్లో ఈ యువ బ్యాట్స్‌మన్ తన ఆటలో ఏమైనా మార్పులు చేసుకుంటాడా?లేక సహజసిద్ధమైన ఆటే ఆడతాడా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు.
సంజూ ధోనీ నుంచి నేర్చుకోవాల్సింది ఉందని, లంక పర్యటనలో అతడికి టీ20ల్లో లేదా వన్డేల్లో తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందో లేదో తనకు తెలియదని చోప్రా పేర్కొన్నాడు. కానీ.. అతడు మాత్రం ఇదివరకే తన సహజసిద్ధమైన ఆట ఆడతానని చెప్పాడని గుర్తుచేశాడు. అయితే, ఇక్కడ జాగ్రత్తగా ఆడటం, అజాగ్రత్తగా ఆడటం అనేవి ఉంటాయని చెప్పాడు. అందులో జాగ్రత్తగా ఆడటమంటే ధోనీలా ఆడాలని, అజాగ్రత్తగా అంటే ఇంతకుముందు కొంత మంది ఆటగాళ్లు ఆడటం చూశామని చెప్పాడు. ఒకవేళ సంజూకు వన్డేల్లో అవకాశం వస్తే పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని సూచించాడు. పిచ్ ఎలా ఉంది, స్కోరుబోర్డు ఎలా సాగుతుందనే విషయాలని గమనించి అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలన్నాడు. అన్ని వేళలా ఒకే పద్ధతిలో ఆడకూడదని, పరిస్థితులకు తగ్గట్టు తనని తాను మలుచుకోవాలని సలహా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీని చూసి నేర్చుకోవాలన్నాడు. ఒక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగి జట్టులో స్థానం కాపాడుకోవాలంటే పరిస్థితులకు తగ్గట్టే ఆడాలని మాజీ క్రికెటర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్‌కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్‌గా సీరియస్‌గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు