Ajinkya Rahane: కౌంటీ క్రికెట్‌కు రహానె విరామం.. కారణం అదేనా?

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె (Ajinkya Rahane) కౌంటీ క్రికెట్‌ ఆడుతూ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాలుగా చెబుతూ కౌంటీ క్రికెట్‌కు మరికొంతకాల విరామం తీసుకున్నాడు.

Published : 30 Jul 2023 14:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె (Ajinkya Rahane) కౌంటీ క్రికెట్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్‌లో (IPL 2023) ప్రదర్శన అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023)తోపాటు విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న రహానె కౌంటీ క్రికెట్‌కు వెళ్తాడని అంతా భావించారు. లీసెస్టర్‌షైర్‌ క్లబ్‌ తరఫున గత జూన్‌లోనే ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌ (Team India) తరఫున టెస్టుల్లోకి పునరాగమనం చేయడంతో ఆ గడువును పొడిగించాడు. కుటుంబంతో గడిపేందుకు మరికొంతకాలం క్లబ్‌ క్రికెట్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు రహానె వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కమిట్‌మెంట్స్‌ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రాణించడంతో వరల్డ్‌ కప్‌ ప్రాబుబల్స్‌లోనూ చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో రహానె నిర్ణయంపై లీసెస్టర్‌షైర్‌ ప్రకటన విడుదల చేసింది. 

ఆ మూడింటి వల్లే.. ఇప్పటి ఆటగాళ్లు ఇలా: కపిల్‌దేవ్

‘‘రహానె పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. గత కొన్ని నెలలుగా బిజీ షెడ్యూల్‌తో గడిపాడు. జాతీయ జట్టుతో ప్రయాణించాడు. అతడు తన కుటుంబంతో గడిపేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలోనే మళ్లీ మాతో కలుస్తాడని భావిస్తున్నాం. అజింక్య రహానెతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటాం. మా కౌంటీ కోసం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అతడి స్థానంలో ఆసీస్‌ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను తీసుకుంటున్నాం. వచ్చే నెల నుంచి మా కౌంటీతో కలుస్తాడు’’ అని లీసెస్టర్‌షైర్ డైరెక్టర్‌ క్లాడే హెండర్సన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని