WI vs IND : సంజూను జట్టు నుంచి పక్కనపెట్టకండి: మాజీ క్రికెటర్‌ సూచన

వన్డే సిరీస్‌(WI vs IND) నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ నేడు. ప్రయోగాలతో తడబడిన భారత్‌(Team India).. మరి కీలకమైన విండీస్‌తో మూడో వన్డేలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుందో చూడాలి.

Published : 01 Aug 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా (Team India) ప్రయోగాలకు సిద్ధమైన వేళ.. బ్యాటింగ్‌ దళం పూర్తిగా తడబడుతోంది. విండీస్‌తో తొలి మ్యాచ్‌(WI vs IND)లో స్వల్ప లక్ష్య చేధనలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక రెండో వన్డేలోనైతే బ్యాటింగ్‌ యూనిట్‌ పూర్తిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో సిరీస్‌ నెగ్గాలంటే.. కీలకమైన మూడో వన్డేలో గెలిచి తీరాలి. మరి ఈ వన్డేలో రోహిత్‌ సేన ప్రయోగాలకు వెళ్తుందా..? లేదా సీనియర్లతో కూడిన జట్టుతో బరిలోకి దిగుతుందా చూడాలి. ఈనేపథ్యంలో టీమ్‌ఇండియాకు మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) ఓ సలహా ఇచ్చాడు.

నేనే బీసీసీఐ అధ్యక్షుడినైతే..

సంజూ శాంసన్‌(Sanju Samson)ను తుది జట్టు నుంచి తప్పించొద్దని కోరాడు. ‘ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ ఓకే. కానీ.. మిడిలార్డర్‌లో అతడు ఎలా ఆడుతాడనేది మనకు తెలియదు. సంజూశాంసన్‌కు ఒక్క మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడే అవకాశం వచ్చింది. కాబట్టి అతడిని తుది జట్టు నుంచి తొలగించొద్దు. ఇక టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసి.. వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్‌(Suryakumar Yadav)కు ఇది ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌ అవుతుంది’ అని చోప్రా పేర్కొన్నాడు.

ఇక రెండో వన్డేకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్‌ పాండ్య(Hardik Pandya).. బ్యాట్‌తో పరుగులు చేయాల్సిన అవసరముందని చోప్రా పేర్కొన్నాడు. ‘హార్దిక్‌ బౌలింగ్‌ చేయడం ముఖ్యమే కానీ.. జట్టులో తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నపుడు అతడు పరుగులు చేయడం మరింత ముఖ్యం’ అని వివరించాడు. వన్డే సిరీస్‌(WI vs IND)లో 1-1తో సమంగా ఉన్న విండీస్‌, భారత్‌ జట్లు నేడు కీలకమైన ఆఖరి వన్డేలో తలపడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని