Sunil Gavaskar: మన జట్టుతో వాళ్లకేం సంబంధం.. మీ సలహాలు మాకొద్దు : గావస్కర్

వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన టీమ్‌ఇండియా జట్టుపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. వీటిపై ఘాటుగా సమాధానమిచ్చాడు మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar)

Updated : 08 Sep 2023 12:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా తన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ఎంపికపై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) మండిపడ్డాడు. అలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్న మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేశాడు.

ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌

జట్టు ఎంపిక విషయంలో మీ సలహాలు మాకు అవసరం లేదంటూ పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మాజీలపై గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్‌ భయపడుతోందని పీసీబీ మాజీ చీఫ్‌ నజమ్‌ సేథీ గతంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గావస్కర్‌ స్పందిస్తూ.. ‘వాళ్ల నుంచి ఏ ప్రకటన వచ్చినా మన మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. టీమ్‌ ఇండియా జట్టును పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంపిక చేస్తున్నట్లు ఉంది. మన టీమ్‌తో వాళ్లకేం సంబంధం? మనవాళ్లు ఎవరైనా వెళ్లి వాళ్ల టీమ్‌ని ఎంపిక చేస్తున్నారా? ఇది వాళ్ల పని కాదు. మీడియాలో చూపించి మనమే వాళ్లకు అవకాశం ఇస్తున్నట్లు ఉంది’ అని గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మన ఆటగాళ్లతో పోల్చుతూ వాళ్ల ఆటగాళ్లే గొప్ప అని ప్రచారం చేసుకుంటారని గావస్కర్‌ అన్నాడు. ‘అక్కడి వాళ్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ కంటే బాబర్‌ గొప్ప అని, షహీన్‌ అఫ్రిది మంచి బౌలర్ అని, సచిన్‌ తెందూల్కర్‌ కంటే ఇంజిమాముల్‌ హక్‌ మంచి బ్యాటర్‌ అని వాళ్లకు వాళ్లు గొప్పలకు పోతారు. ఇలా వాళ్ల అభిమానులకు దగ్గరవుతారు. మన మీడియాలో వారికి అంతా ప్రాధాన్యం ఇవ్వొద్దు. మీ జట్టులో ఈ ఆటగాడు ఉండాలని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చెబుతుంది. ఎవరు మూడు, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలో వాళ్లే చెబుతారు. మీ సలహాలు మాకు అవసరం లేదు’ అని గావస్కర్‌ విరుచుకుపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని