Sanju Samson: సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలి: సబా కరీం

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విఫలమైన సంజూ శాంసన్‌పై (Sanju Samson) సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వన్‌డౌన్‌లో వచ్చినా సరైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలం కావడం గమనార్హం.

Published : 30 Jul 2023 15:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాడు సంజూ శాంసన్‌ (Sanju Samson) విండీస్‌తో రెండో వన్డేలో ఆడాడు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్‌ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కారీ బౌలింగ్‌లో ఆడదామా..? వద్దా..? అన్నట్లుగా బ్యాటింగ్‌ చేసి ఔటయ్యాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడంపై సంజూ శాంసన్‌ అభిమానులు తీవ్రంగా నిరాశ  చెందారు. వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం మాత్రం సంజూ శాంసన్‌ ఆటతీరును విమర్శిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘సంజూ శాంసన్‌కు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా ఉండాలనుకోవడం లేదు. ఇలాంటి మాట అనడానికి మరో కారణం ఉంది. అతడు వికెట్ కీపర్ - బ్యాటర్‌గా కంటే స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అయితేనే బాగుంటుంది. అలాగే రెండో వన్డేలో వచ్చిన వన్‌డౌన్‌ కూడా అతడికి సరిపోదు. నాలుగు లేదా ఐదో స్థానంలో సరిగ్గా నప్పుతాడు. అందుకే, అతడిని తీసుకోవాలని భావిస్తే మిడిలార్డర్‌లోనే ఆడించాలి. 

ఆ మూడింటి వల్లే.. ఇప్పటి ఆటగాళ్లు ఇలా: కపిల్‌దేవ్

భారత జట్టులో అయోమయానికి గురయ్యే అంశం మరొకటి ఉంది. ఒకవేళ కేఎల్‌ రాహుల్‌ జట్టుతోపాటు చేరితే.. ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌కు వస్తాడా..? లేదా? అనే ప్రశ్న వస్తుంది. ఇషాన్‌ కచ్చితంగా ఓపెనర్‌గా రాడని నేను చెప్పగలను. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడనేది వాస్తవం. అయితే, మిడిలార్డర్‌ బ్యాకప్‌గా మాత్రం ఇషాన్‌ కిషన్‌ పనికొస్తాడు’’ అని సబా కరీం వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని