Asia Cup 2023: హార్దిక్‌ పాండ్యకు ‘బ్యాకప్‌’ విషయంలో మాజీల మధ్య తీవ్ర చర్చ!

మినీ టోర్నీ ఆసియా కప్‌ (Asia Cup 2023) బరిలోకి దిగేందుకు 17 మందితో కూడిన జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. దీనిపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.  

Published : 24 Aug 2023 14:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ కోసం (Asia Cup 2023) భారత్‌ ప్రకటించిన జట్టులో సీనియర్లతోపాటు యువ క్రికెటర్ తిలక్‌ వర్మకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యకు బ్యాకప్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. అదేవిధంగా స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకుంది. అయితే, శార్దూల్ ఠాకూర్‌ కంటే ఆల్‌రౌండర్ బ్యాకప్‌గా శివమ్‌ దూబె ఉంటే బాగుండేదని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. అయితే, గంభీర్‌ వ్యాఖ్యలపై మాజీ సెలెక్టర్ సునీల్‌ జోషి స్పందించారు. 

తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్‌ను నియంత్రించడం చాలా కష్టం.. ప్రజ్ఞానంద అద్భుతం

‘‘శివమ్‌ దూబె ఫామ్‌ను లెక్కలోకి తీసుకుని ఎంపిక చేస్తే బాగుండేది. హార్దిక్ పాండ్యకు బ్యాకప్‌ అవసరం. శార్దూల్ ఠాకూర్‌ ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అందుకు పాండ్య బ్యాకప్‌గా శివమ్‌ దూబె బాగుంటుందని నా అభిప్రాయం. ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టులో మరో మణికట్టు స్పిన్నర్‌ ఉండాల్సింది. యుజ్వేంద్ర చాహల్ లేదా రవి బిష్ణోయ్‌లో ఒకరిని తీసుకోవాల్సింది. ఉపఖండ పిచ్‌లపై ఇలాంటి స్పిన్నర్లు చాలా ప్రభావం చూపిస్తారు. అదే విధంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగాల్సిన అవసరం లేదు. కనీసం మరో లెగ్‌ స్పిన్నర్‌కు అవకాశం కల్పిస్తే బాగుండేది. షమీకి విశ్రాంతి ఇచ్చి ఉంటే స్పిన్నర్‌ను తీసుకొనే వెసులుబాటు ఉండేది’’ అని గంభీర్‌ తెలిపాడు. 

గంభీర్ అభిప్రాయాలపై సునీల్ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జట్టులో మార్పులు అవసరం లేదనిపిస్తోంది. శివమ్‌ దూబె ప్రదర్శన చూశాం. టీ20ల్లో బాగానే ఆడుతున్నప్పటికీ వన్డే ఫార్మాట్‌లో రాణించలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శనేమీ లేదు. ఫీల్డింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. శార్దూల్ ఠాకూర్‌ ఇటీవల అద్భుతంగా రాణించాడు. అందుకే, గంభీర్‌ మీ పట్ల నాకు గౌరవం ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని సునీల్ జోషి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు