కేకేఆర్‌ ఆటగాళ్ల ఇక్కట్లు

ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్‌నవూ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది.

Updated : 09 May 2024 00:51 IST

దిల్లీ: ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్‌నవూ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. ఆదివారం 98 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌పై గెలిచిన కోల్‌కతా జట్టు.. సోమవారం సాయంత్రం 5.45కు కోల్‌కతా బయల్దేరింది. విమానం 7.25కు కోల్‌కతా చేరుకోవాల్సింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా కోల్‌కతాలో ల్యాండ్‌ చేయడం సాధ్యం కాకపోవడంతో విమానాన్ని గువాహటికి మళ్లించారు. అనుమతి లభించడంతో కొంత సమయం తర్వాత విమానం మళ్లీ కోల్‌కతా బయలుదేరింది. ‘‘గువాహటి నుంచి కోల్‌కతాకు తిరిగి వెళ్లడానికి మాకు అనుమతి లభించింది. రాత్రి 11 గంటల కల్లా అక్కడ ఉంటాం’’ అని రాత్రి 9.43కు కేకేఆర్‌ మీడియా బృందం తెలిపింది. కానీ కోల్‌కతా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఇబ్బందులు అంతటితో ఆగలేదు. కోల్‌కతాలో విమానాన్ని దించడానికి అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో అధికారులు దాన్ని వారణాసికి మళ్లించారు. కోల్‌కతా బృందం రాత్రి అక్కడ హోటల్లో గడిపింది. కోల్‌కతా తన తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 11న ఈడెన్‌ గార్డెన్స్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు