ఒత్తిడిలోనూ రోహిత్‌ మంచి నిర్ణయాలు

ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్‌ కీలకమవుతాడని తెలిపాడు.

Updated : 09 May 2024 00:51 IST

దిల్లీ: ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్‌ కీలకమవుతాడని తెలిపాడు. ‘‘పొట్టి కప్పులో రోహిత్‌ చాలా కీలకం. మనకు సమర్థుడైన సారథి ఉండాలి. ఒత్తిడిలోనూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నిరుడు వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడినప్పుడు భారత్‌కు రోహిత్‌ కెప్టెన్‌. సారథిగా అతను అయిదు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచాడు. భారత్‌కు రోహిత్‌ లాంటి నాయకుడే కావాలి. ఆటగాడిగా గొప్ప విజయాలు అందుకున్నా అతడి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు గమనించలేదు. అదే అతడిలోని గొప్పతనం. రోహిత్‌ ప్రపంచకప్‌ అందుకుంటే చూడాలనుంది’’ అని యువీ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు