బంగ్లాదే సిరీస్‌

జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.

Updated : 09 May 2024 00:50 IST

చట్టోగ్రామ్‌: జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. మొదట బంగ్లాదేశ్‌ 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. తౌహిద్‌ హృదోయ్‌ (57; 38 బంతుల్లో 3×4, 2×6), జకీర్‌ అలీ (44; 34 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ముజరబాని (3/14) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. సైఫుద్దీన్‌ (3/42), రిషాద్‌ (2/38) విజృంభించడంతో ఛేదనలో జింబాబ్వే 156/9కే పరిమితమైంది. పదో నంబర్‌ బ్యాటర్‌ ఫరాజ్‌ అక్రమ్‌ (34 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ మరుమని (31; 26 బంతుల్లో 2×4, 1×6) కూడా రాణించాడు. జింబాబ్వే ఒక దశలో 91కే 8 వికెట్లు కోల్పోయినా.. ఫరాజ్‌, మసకద్జ (13)తో కలిసి పోరాడడంతో జింబాబ్వే (18 బంతుల్లో 36) పోటీలోకి వచ్చింది. కానీ ఆఖËర్లో తడబడి ఓటమి చవిచూసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని