IND vs AUS: ఆస్ట్రేలియాతో భారత్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌.. బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

మరో ఆరు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆలోపు ఆటగాళ్లకు పిచ్‌లు  అలవాటు అయ్యేందుకు రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా తలపడనుంది. ఇవాళ ఆసీస్‌తో మొదటి వార్మప్‌ జరగనుంది.

Updated : 17 Oct 2022 09:33 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లను ఆడనుంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మొదటి మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకొంది. అసలు సమరంలోకి దిగేముందు సభ్యుల ఫిట్‌నెస్‌, ఫామ్‌ను పరీక్షించుకోవడానికి భారత్‌, ఆసీస్‌కు ఇదొక చక్కని అవకాశం. కరోనా నుంచి కోలుకొని వచ్చిన షమీకి తుది జట్టులో స్థానం కల్పించలేదు. అయితే ప్రాక్టీస్‌ సందర్భంగా మధ్యలో కొన్ని ఓవర్లు వేసే ఛాన్స్‌ ఉంది. షమీతోపాటు చాహల్‌ను బౌలర్లుగా వినియోగించుకొనేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది.

జట్ల వివరాలు:

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తిక్‌, అక్షర్ పటేల్,  రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌,  భువనేశ్వర్‌ కుమార్‌

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, ఇంగ్లిస్, టిమ్‌ డేవిడ్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని