IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలోకొవిడ్‌ కేసులు వచ్చినా...

ఆటగాళ్లు లేదా సహాయ సిబ్బందిలో కొవిడ్‌-19 వచ్చినా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు, వన్డే సిరీస్‌లు కొనసాగుతాయి. రెండు దేశాల బోర్డులు ఇందుకు అంగీకరించాయి.

Updated : 23 Dec 2021 07:17 IST

దిల్లీ: ఆటగాళ్లు లేదా సహాయ సిబ్బందిలో కొవిడ్‌-19 వచ్చినా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు, వన్డే సిరీస్‌లు కొనసాగుతాయి. రెండు దేశాల బోర్డులు ఇందుకు అంగీకరించాయి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికి ఐసోలేషన్‌ కూడా ఉండదని క్రికెట్‌ దక్షిణాఫ్రికా బోర్డు షుయబ్‌ మంజ్రా చెప్పాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 26న ఆరంభం కానుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. ఒప్పందం ప్రకారం దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత పెరిగితే సిరీస్‌ నుంచి వైదొలిగే వీలు భారత్‌కు ఉన్నా... ప్రస్తుతానికి బీసీసీఐకి పర్యటన నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని ఓ బోర్డు అధికారి చెప్పాడు. సీఏస్‌ఏ ఏర్పాటు చేసిన బయో బబుల్‌పై బోర్డు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. సిరీస్‌ సందర్భంగా రెండు జట్ల ఆటగాళ్లకు రోజూ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని