ఒక్కటైన రాహుల్‌, అతియా

భారత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక ఇంటివాడయ్యాడు. కొన్నేళ్లుగా తాను ప్రేమిస్తున్న సినీ నటి అతియా శెట్టిని సోమవారం వివాహమాడాడు.

Published : 24 Jan 2023 02:02 IST

ముంబయి: భారత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక ఇంటివాడయ్యాడు. కొన్నేళ్లుగా తాను ప్రేమిస్తున్న సినీ నటి అతియా శెట్టిని సోమవారం వివాహమాడాడు. మహారాష్ట్రలోని ఖండాలాలో అతియా తండ్రి, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో వీరి పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాహుల్‌, అతియా ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం ఈ జంట బయట వేచి చూస్తున్న మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చి ఫొటోలకు పోజులిచ్చింది. తమ పెళ్లి ఫొటోలను రాహుల్‌, అతియా సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకున్నారు. ‘‘అతియా వెలుగులో నేను ప్రేమించడం నేర్చుకున్నా. ఈ రోజు అత్యంత ఇష్టమైన వ్యక్తుల మధ్య మా ఇంట్లో మేం పెళ్లి చేసుకున్నాం. అది మాకెంతో ఆనందాన్నిచ్చే విషయం. మా ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. 30 ఏళ్ల రాహుల్‌, తనతో సమాన వయసున్న అతియాతో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు. కొంత కాలం తమ ప్రేమను దాచి ఉంచిన ఈ జంట.. తర్వాత బహిరంగపరిచింది. పెళ్లి కోసమే రాహుల్‌ న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని