KL Rahul: బీసీసీఐ గ్రేడ్స్‌లో రాహుల్ కిందికి
కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ గ్రేడ్స్‌లోనూ పడిపోయాడు.
ముంబయి: కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ గ్రేడ్స్‌లోనూ పడిపోయాడు. తాజాగా ప్రకటించిన వార్షిక జాబితాలో అతడు ఎ నుంచి బికి వచ్చాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏ నుంచి ఏ ప్లస్‌కు ఉన్నతి పొందగా.. కోహ్లి, రోహిత్, బుమ్రా ఏ ప్లస్‌లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అశ్విన్, రిషబ్ పంత్, షమి ఏలోనే కొనసాగుతున్నారు. హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ కొత్తగా ఏ కేటగిరిలోకి వచ్చారు. ఇంతకుముందు హార్దిక్ సిలో, అక్షర్ బిలో ఉన్నారు. రాహుల్‌తో పాటు పుజారా, శ్రేయస్, సిరాజ్, సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ బిలో ఉన్నారు. ఉమేశ్, శిఖర్, శార్దూల్, ఇషాన్, హుడా, చాహల్, కుల్‌దీప్, సుందర్, శాంసన్, అర్ష్‌దీప్, భరత్ సిలో ఉన్నారు. రహానె, ఇషాంత్, భువనేశ్వర్, విహారి, సాహా, మయాంక్, దీపక్ చాహర్ కాంట్రాక్ట్స్ జాబితాలో చోటు కోల్పోయారు. ఏడాదికి ఏ ప్లస్‌కు రూ.7 కోట్లు, ‘ఎ’కి రూ.5 కోట్లు, ‘బి’కి రూ.3 కోట్లు, ‘సి’కి రూ.కోటి లభిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు