27న బీసీసీఐ ఎస్‌జీఎం

అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

Published : 20 May 2023 04:07 IST

దిల్లీ: అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈనెల 27న జరిగే ఎస్‌జీఎంలో లైంగిక వేధింపుల నిరోధక విధానానికి బోర్డు ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల పర్యవేక్షణకు అత్యున్నత స్థాయి ‘వర్కింగ్‌ గ్రూపు’ను ఏర్పాటు చేయనుంది. మౌలిక వసతుల అభివృద్ధి- సబ్సిడీ సబ్‌ కమిటీ ఏర్పాటు, రాష్ట్ర జట్లకు ఫిజియోథెరపిస్టులు.. ట్రెయినర్ల నియామకం కోసం మార్గదర్శకాల రూపకల్పన, మహిళల ప్రిమియర్‌ లీగ్‌ కమిటీ ఏర్పాటు చేయడం ఎస్‌జీఎం అజెండాలోని మిగతా మూడు అంశాలు. ప్రపంచకప్‌ నేపథ్యంలో బీసీసీఐ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, సీఈఓ, ఇతర సీనియర్‌ అధికారులు ఉండనున్నారు. ఇప్పటికే ప్రపంచకప్‌ వేదికల్ని ఖరారు చేసిన బీసీసీఐ.. స్టేడియాల పునరుద్ధణ కోసం నిధులు కూడా కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని