గోపీ ప్రోత్సాహంతోనే..

కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రోత్సాహంతోనే ఆరేళ్ల విరామం తర్వాత టైటిల్‌ గెలవగలిగానని స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌.ప్రణయ్‌ అన్నాడు.

Published : 29 May 2023 02:27 IST

కౌలాలంపుర్‌: కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రోత్సాహంతోనే ఆరేళ్ల విరామం తర్వాత టైటిల్‌ గెలవగలిగానని స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌.ప్రణయ్‌ అన్నాడు. ‘‘నా కెరీర్‌ గత కొన్నేళ్లు ఎత్తుపల్లాలతో సాగింది. ఆరేళ్ల విరామం తర్వాత టైటిల్‌ అందుకుంటానని అసలు ఊహించలేదు. 2017లో తొలి టైటిల్‌ గెలిచినప్పుడు అడిగివుంటే.. మళ్లీ 2023లో టైటిల్‌ గెలుస్తానని అప్పుడు చెప్పివుండేవాడిని కాదు. కోచ్‌ గోపీ సార్‌, సహాయక సిబ్బంది వల్లే ఇప్పుడు టైటిల్‌ నెగ్గగలిగాను. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తావని.. అలా నమ్మాలని గోపీ నాలో స్ఫూర్తి నింపేవాడు. ఒకప్పుడు సహచరుడు.. ఇప్పుడు కోచ్‌గా మారిన గురు సాయిదత్‌ కూడా ప్రాక్టీస్‌లో నాకెంతో సాయం చేశాడు’’ అని ప్రణయ్‌ చెప్పాడు. ‘‘ప్రణయ్‌ స్థిరంగా ఆడుతున్నాడు. ఒక ట్రోఫీ గెలిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావించాం. అతడు ప్రస్తుతం ఉన్న టాప్‌ ప్లేయర్లందరిని ఓడించాడంటే అది కేవలం నమ్మకం వల్లే సాధ్యమైంది. కొన్ని కొత్త షాట్లు కూడా ప్రణయ్‌ని మెరుగైన ఆటగాడిగా నిలబెట్టాయి’’ అని గురుసాయిదత్‌ తెలిపాడు. గతేడాది స్విస్‌ ఓపెన్లో ఫైనల్స్‌ వరకు వచ్చి రన్నరప్‌గా నిలిచిన ప్రణయ్‌.. మలేసియా ఓపెన్‌, ఇండోనేసియా ఓపెన్లో సెమీఫైనల్లో ఓడిపోయాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు