ఏదైనా జట్టు కోసమే

భారత్‌ తరఫున 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడటం గొప్పగా అనిపిస్తోందని టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు.

Updated : 23 Jul 2023 04:21 IST

భారత్‌ తరఫున 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడటం గొప్పగా అనిపిస్తోందని టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఈ మ్యాచ్‌ను శతకంతో మరింత ప్రత్యేకంగా మార్చుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అతను చెప్పాడు. విండీస్‌తో రెండో టెస్టులో శతకం గురించి విరాట్‌ స్పందిస్తూ.. ‘‘ఈ ఇన్నింగ్స్‌ను ఎంతగానో ఆస్వాదించా. నేను మంచి లయలో ఉన్నాను. నేను ఏదైనా అడ్డంకిని అధిగమించాలని అనుకుంటే.. దానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఔట్‌ ఫీల్డ్‌ నెమ్మదిగా ఉండటం వల్ల నేను ఓపిగ్గా ఆడాల్సి వచ్చింది. కఠినమైన పరిస్థితుల్లో సాధించిన శతకం కావడంతో ఇది నాకెంతో సంతృప్తినిచ్చింది. భారత్‌ తరఫున 500 మ్యాచ్‌లు ఆడినందుకు ధన్యుడిని. టెస్టుల్లో నేను స్వదేశంలో కంటే బయటే ఎక్కువ శతకాలు సాధించా. నా విదేశీ శతకాలు 15. జట్టు కోసం నేనేం చేయాలనే ఎప్పుడూ ఆలోచిస్తా. ఈ క్రమంలో మైలురాళ్లను అందుకున్నపుడు మరింత ఆనందం కలుగుతుంది. ఫిట్‌నెస్‌ నాకు అన్ని ఫార్మాట్లలోనూ తోడ్పడుతుంది. సింగిల్‌ను డబుల్‌గా మార్చడం కష్టంగా అనిపించదు’’ అని పేర్కొన్నాడు.


హామిల్టన్‌ రెండేళ్ల తర్వాత..

బుడాపెస్ట్‌: వరుసగా అయిదు పోల్‌ పొజిషన్స్‌ సాధించిన ఫార్ములావన్‌ స్టార్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) జోరుకు లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) చెక్‌ పెట్టాడు. శనివారం హంగేరీ గ్రాండ్‌ ప్రిలో క్వాలిఫయింగ్‌లో రాణించి పోల్‌ దక్కించుకున్నాడు. హామిల్టన్‌ 0.003 సెకన్లలో వెర్‌స్టాపెన్‌ను వెనక్కి నెట్టాడు. 2021 సౌదీ అరేబియా రేసు తర్వాత పోల్‌ సాధించడం అతడికిదే తొలిసారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు