Sanju Samson: కొట్టాడు ఎట్టకేలకు

ఏదైనా దేశంతో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడుతుందంటే చాలు.. ముందుగా భారత జట్టులో శాంసన్‌ ఉన్నాడా? లేడా? అనే చర్చ మొదలవుతుంది.

Updated : 22 Dec 2023 09:35 IST

దైనా దేశంతో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడుతుందంటే చాలు.. ముందుగా భారత జట్టులో శాంసన్‌ ఉన్నాడా? లేడా? అనే చర్చ మొదలవుతుంది. ఒకవేళ జట్టులో చోటు దక్కకపోతే.. ప్రతిభావంతుడైన ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదంటూ ఓ వర్గం ప్రశ్నలు సంధిస్తుంది. మరోవైపు ఇచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నాడంటూ మరో వర్గం వాదిస్తుంది. కానీ ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని శాంసన్‌ రాణించాడు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్లో శతకాల ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో శాంసన్‌ 50.25 సగటుతో 402 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 19.68 సగటుతో 374 పరుగులే చేశాడు. టీ20లో అంచనాలను అందుకోలేకపోతున్న శాంసన్‌.. వన్డేల్లో మాత్రం నిలకడ ప్రదర్శిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అతని సగటే అందుకు నిదర్శనం. ఇప్పుడేమో ఇన్ని రోజులుగా ఉన్న సెంచరీ లోటును కూడా భర్తీ చేశాడు. ముఖ్యంగా జట్లు కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుత బ్యాటింగ్‌తో శాంసన్‌ అలరించాడు. శాంసన్‌ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. వన్డేల్లో 2021లో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు