KL Rahul: భేష్‌ రాహుల్‌

సెంచూరియన్‌లో సెంచరీ సాధించిన కేఎల్‌ రాహుల్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన శతకం భారత టెస్టు చరిత్రలో టాప్‌-10 సెంచరీల్లో ఒకటని అన్నాడు.

Updated : 28 Dec 2023 09:36 IST

సెంచూరియన్‌: సెంచూరియన్‌లో సెంచరీ సాధించిన కేఎల్‌ రాహుల్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన శతకం భారత టెస్టు చరిత్రలో టాప్‌-10 సెంచరీల్లో ఒకటని అన్నాడు. భారత్‌ 92కే నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. అద్భుత పోరాటంతో శతకం సాధించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గావస్కర్‌ స్పందించాడు. స్టార్‌స్పోర్ట్స్‌లో వ్యాఖ్యానం చేస్తూ రాహుల్‌ను మెచ్చుకున్నాడు. ‘‘50 ఏళ్లుగా నేను క్రికెట్‌ చూస్తున్నా. రాహుల్‌ సాధించిన ఈ శతకం భారత టెస్టు చరిత్రలో టాప్‌-10లో ఒకటిగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పగలను. ఇది చాలా భిన్నమైన పిచ్‌’’ అని గావస్కర్‌ అన్నాడు. బంతి ఎలా వస్తుందో తెలియని క్లిష్టమైన పిచ్‌పై రాహుల్‌ గొప్పగా ఆడాడడని, అలాంటి పిచ్‌పై ఆడాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని