భారత క్రికెటర్లను మార్చింది కోహ్లినే

ఫిట్‌నెస్‌ను ఎంతో ప్రేమించే విరాట్‌ కోహ్లి భారత క్రికెటర్లందరిని తన బాటలో నడిపిస్తున్నాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కొనియాడాడు. ఐపీఎల్‌ వ్యాఖ్యతగా ఉన్న కేపీ ఇలా వ్యాఖ్యానించాడు.

Published : 27 Mar 2024 01:50 IST

దిల్లీ: ఫిట్‌నెస్‌ను ఎంతో ప్రేమించే విరాట్‌ కోహ్లి భారత క్రికెటర్లందరిని తన బాటలో నడిపిస్తున్నాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కొనియాడాడు. ఐపీఎల్‌ వ్యాఖ్యతగా ఉన్న కేపీ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘భారత క్రికెటర్లను అథ్లెట్లుగా, బలంగా మారేలా చేసింది కోహ్లినే. చెప్పడమే కాదు తాను ముందుండి నడిపించాడు. ఆటగాడిగా ఎన్నో చిరస్మరణీమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వికెట్ల మధ్య పరుగెత్తే తీరు చూస్తే అతడి అంకితభావం, ఆట పట్ల తృష్ణ తెలుస్తాయి. మైదానంలోకి రాక ముందే తినే ఆహారం దగ్గర నుంచే అతడి శిక్షణ మొదలవుతుంది. జిమ్‌లో శ్రమించే తీరు గురించి ఇక చెప్పక్కర్లేదు. అతడి కెప్టెన్సీలో ఆడినవాళ్లు.. చూసినవాళ్లు విరాట్‌ని అనుసరిస్తున్నారు. ఫిట్‌నెస్‌ పరంగా భారత క్రికెట్‌ను మలుపు తిప్పింది కోహ్లినే’’ అని కేపీ చెప్పాడు. ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కూడా కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘తన ఆటను విరాట్‌ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటాడు. పంజాబ్‌పై తాను ఎందుకు మ్యాచ్‌ను ముగించలేకపోయానా అని ఆ రాత్రి ఆలోచిస్తూ ఉంటాడు. మైదానం వీడిన తర్వాత అతడిలా ఎవరూ అంతగా ఆట గురించి ఆలోచించరు. ఐపీఎల్‌ చరిత్రలో ఎక్కువ 50 ప్లస్‌ స్కోర్లు చేసిన ఘనతను సొంతం చేసుకున్న విరాట్‌కు అభినందనలు’’ అని ఏబీ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని