దాదా.. త్వరగా కోలుకో ప్లీజ్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు....

Updated : 02 Jan 2021 17:33 IST

గుండెపోటని తెలియడంతో క్రికెట్‌ ప్రపంచం దిగ్భ్రాంతి

కోల్‌కతా: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు. టీమ్‌ఇండియా ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ, బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జే షా, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌సింగ్‌, అనిల్‌ కుంబ్లే, గౌతమ్‌ గంభీర్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌.. దాదా వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.

ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచారు. ఎస్‌ఎస్‌కేఎం కార్డియాలజిస్టు డాక్టర్‌ సరోజ్‌ మొండల్‌ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం దాదాకు కరోనరీ యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తోంది. గుండె రక్తనాళాల్లో పూడికను పరిశీలించనున్నారు. ఉదయం కసరత్తులు చేస్తున్నప్పుడు గంగూలీకి ఛాతిలో నొప్పిగా అనిపించింది. దాంతో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.‌‌

మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. త్వరగా ఆరోగ్యవంతులు అవ్వండి గంగూలీ- విరాట్‌ కోహ్లీ

గంగూలీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ప్రస్తుతం దాదా బాగున్నారు. వైద్యానికి స్పందిస్తున్నారు- జై షా, బీసీసీఐ కార్యదర్శి

బీసీసీఐ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం - బీసీసీఐ

టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి ఈరోజు ఉదయం స్వల్ప గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దాదా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం- ఐసీసీ

దాదా, మీరు తొందరగా  కోలుకోవాలి. అందుకోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను -వీరేంద్ర సెహ్వాగ్‌

గంగూలీకి త్వరగా మెరుగవ్వాలి. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఆశీస్సులు ఉండుగాక - గంభీర్‌

దాదా తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌ వెల్‌సూన్‌ - శిఖర్‌ ధావన్‌

గుండెపోటుతో గంగూలీ ఆస్పత్రిలో చేరడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలి - మమతా బెనర్జీ, బెంగాల్‌ ముఖ్యమంత్రి

గుండెపోటుకు గురైన గంగూలీ అత్యంత వేగంగా కోలుకోవాలి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి సీఈవో ద్వారా తెలిసింది- జగదీప్‌ ధన్‌కర్‌, బెంగాల్‌ గవర్నర్‌

ఇవీ చదవండి
దాదాకు గుండెపోటు
అభిమాని సర్‌ప్రైజ్‌: బాగోదన్న రోహిత్‌

 








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని