rishabh pant: పంత్‌ పుట్టిన రోజున ప్రేయసి పోస్ట్‌!

రిషభ్‌ పంత్‌ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, క్రికెటర్ల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ప్రేయసి ఇషా నేగి ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసింది.

Published : 04 Oct 2022 22:20 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ మంగళవారం తన 25వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్బంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, క్రికెటర్ల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ప్రేయసి ఇషా నేగి ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసింది. పంత్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియతమా’ అంటూ క్యాప్షన్‌ రాసి లవ్‌ సింబల్‌ను జత చేసింది. 

కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ యువ ఆటగాడి సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌కు చెందిన ఇషా బీఏ ఆనర్స్‌ పూర్తి చేసింది. ఇంటీరియర్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగాల్లో పనిచేస్తోంది. ప్రస్తుతం మోడల్‌గానూ రాణిస్తోంది. క్రికెట్‌కు వీరాభిమాని అయిన ఈ చిన్నది తనకు ఇష్టమైన ఆటగాడు మాత్రం విరాట్‌ కోహ్లీనే అని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని